సూర్యాపేట : ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

సూర్యాపేట : ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

సూర్యాపేట, ఆగస్టు20, మనసాక్షి:

సూర్యాపేట పట్టణంలోని రూ.156 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనం , రూ. 38.50 కోట్లతో నిర్మించిన డి.పి.ఓ భవనం, రూ. 30.18 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేట్ మార్కెట్ భవనం , అలాగే రూ. 64.94 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి కె చంద్ర శేఖర్ రావు కు ఎస్.వి.డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 2.35 ని.లకు చేరుకున్నారు.

 

హెలిప్యాడ్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జెడ్.పి. చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి.జి.పి. అంజనీ కుమార్, జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నతాధికారులు,

 

శాసన మండలి సభ్యులు యం.సి కోటి రెడ్డి,ఉమ్మడి నల్గొండ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి, రమవత్ రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి, నోముల భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , నోముల భగత్, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య మంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందచేశారు.

 

MOST READ : 

  1. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్
  2. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  3. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  4. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!