BREAKING : రాజస్థాన్ లో ఇంటిపై కూలిన యుద్ద విమానం 

BREAKING : రాజస్థాన్ లో ఇంటిపై కూలిన యుద్ద విమానం 

మన సాక్షి :

రాజస్థాన్ లోని హనుమాన్ ఘాట్ జిల్లాలో భారత యుద్ధ విమానం మిగ్ -21 కూలిపోయింది. హనుమాన్ గఢ్ లోని డబ్లీ ప్రాంతంలో ఈ విమానం ఓ ఇంటిపై కూలడంతో ఇద్దరు మృతి చెందారు. యుద్ధ విమానం ఇంటిపై కూలాటం తీవ్ర కలకలం రేపింది.

 

ఈ ప్రమాదం నుంచి పైలెట్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోవడంతో పాటు ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స నిర్వహిస్తున్నారు.

 

ఈ యుద్ధ విమానం రాజస్థాన్ లో ని సూరత్ గడ్ ఎయిర్ బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరింది. ఆ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి జరిగిన కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.