హైదరాబాద్ శివారులో దారుణం : పదవ తరగతి
విద్యార్థి పై స్నేహితుడు కత్తితో దాడి
హైదరాబాద్ (రాజేంద్రనగర్) మనసాక్షి : హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడితో కలిసి మరో విద్యార్థి దుర్గాప్రసాద్ పై కత్తులతో దాడి చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ కు దుర్గాప్రసాద్ హాయ్ చెప్పాడని కోపంతో రగిలిపోయిన విద్యార్థి దుర్గాప్రసాద్ పై దాడి చేయాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు సాయంతో ఇద్దరు కలిసి దుర్గాప్రసాద్ కు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పై రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని మూసి వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా దుర్గాప్రసాద్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1. రూ. 30 తిరిగి ఇవ్వాలని అడిగినందుకు… కొట్టి చంపారు
2. కోడలికి పెళ్లి చేసిన అత్తమామలు, గిఫ్ట్ గా రూ. 60 లక్షల ఆస్తి









