Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
రేషన్ దుకాణం పై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
రేషన్ దుకాణం పై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
బినామీ వ్యక్తితో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం సీజ్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ రేషన్ దుకాణాన్ని అధికారులు తనిఖీ చేశారు. అస్సలు డీలర్ ఒక్కరు అయితే బినామీ పేరుతో మరొక్కరు నడిపిస్తున్నారన్న పక్క సమాచారంతో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రేషన్ డీలర్ ను తొలగించి దుకాణాన్ని సీజ్ చేశారు ఈ రేషన్ దుకాణాన్ని మరొకరికి తాత్కాలికంగా కేటాయించారు అతనిపై నిత్యావసర సరుకుల సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.









