సూర్యాపేట : రైతుల ఇబ్బందులు, సలహాలకు కంట్రోల్ రూమ్ నెం. 6281492368
సూర్యాపేట : రైతుల ఇబ్బందులు, సలహాలకు కంట్రోల్ రూమ్ నెం. 6281492368
రైతుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు-కలెక్టర్ యస్. వెంకట్రావు
సూర్యాపేట , మనసాక్షి :
రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట కలెక్టర్ యస్. వెంకట్రావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో సమావేశ మందిరం పక్కన కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ యస్. వెంకట్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఇబ్బందులు ఎదురైనా సలహాల కొరకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 6281492368 కాల్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.
కంట్రోల్ రూమ్ నందు అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, డియం సివిల్ సప్లై రాంపతి సిబ్బంది పాల్గొన్నారు.









