Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి.. ఆస్పత్రికి తరలింపు

మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి ఆస్పత్రికి తరలింపు

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీ ఫేస్ త్రీ లో అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి మున్సిపల్ ఉద్యోగి బిక్షం పై గొడ్డలి తో దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది ..

 

అందిన వివరాల మేరకు అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని సమాచారం అందుకున్న మున్సిపాలిటీ అధికారి ఆ ప్రాంతానికి చేరుకొని అక్రమ నిర్మాణం ఆపమన్నందుకు అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి మున్సిపల్ అధికారిపై ఘర్షణకు దిగాడు..ఒక్కసారిగా గొడ్డలి తీసుకొని దాడి చేయడంతో తలకు గాయాలు కావడంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు..

 

ప్రస్తుతం గాయాలు పాలైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంది.. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మున్సిపల్ సిబ్బంది ,ప్రజలు కోరుతున్నారు.. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడికి పూనుకోవడం దుర్గమ దుర్మార్గం అని స్థానిక ప్రజలు వాపోయారు.. సమాచారం అందుకున్న సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు..

మరిన్ని వార్తలు