Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో కార్డెన్ సెర్చ్

Suryapet : సూర్యాపేటలో కార్డెన్ సెర్చ్

కారిడెన్ సెర్చ్ కు ప్రజలు సహకరించాలి

డి.ఎస్పి నాగభూషణం

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రం లో నివసిస్తున్న ప్రజల భద్రత కోసమే కారిడేన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు డిఎస్పి నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రం లోని 9వ వార్డ్ ఎన్టీఆర్ కాలనీలో కారిడేన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు.

 

అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.సరైన ధ్రువ పత్రాలు లేని నలబై రెండు ద్విచక్రవాహనాలు,నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై,పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచుతున్నామన్నారు.
ఏలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనిసూచించారు.

 

నేరాల నివారణ చర్యలలో భాగంగా జిల్లా కేంద్రం లోని పలు ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా కూడళ్లలో సి‌సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని తెలిపారు.

 

బ్యాంక్ సిబ్బంది ఎవరైనా కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను అడిగే అవకాశం లేదని వివరించారు. ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించాలని అన్నారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. అనుమతి లేని ప్రవేటు చీట్స్ ఫండ్స్ లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.

 

ఎలాంటి అత్యవసర సమయంలో అయిన 100 నంబర్ కు లేదా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు.సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్బన్ సెర్చ్ లో సీఐ రాజశేఖర్ పట్టణ ఎస్ఐ లు యాట సైదులు, పడిశాల శ్రీనివాస్,యాకుబ్ ఏఎస్ఐ కుశలవ్, పోలీస్ సిబ్బంది, జిల్లా ఆర్మీ పోలీస్ లు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు