Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda | కనగల్ లో గాలివాన బీభత్సం..!

Nalgonda | కనగల్ లో గాలివాన బీభత్సం..!

కనగల్ , మన సాక్షి

నల్లగొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో శనివారం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. కనగల్ క్రాస్ రోడ్ వద్ద పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోవడంతో పాటు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఒకచోట చెట్టు విరిగి రెండు బైకులపై పడడంతో నుజు నుజ్జు అయ్యాయి.

 

కనగల్, అమ్మగూడెం, తుర్కపల్లి, గోగుబుచ్చయ్య గూడెం, కుమ్మరిగూడెం, పర్వతగిరి, లచ్చిగూడెం, ఏం గౌరారం, బుడమల్లపల్లి, బోయినపల్లి తదితర గ్రామాల్లో 33 కెవి విద్యుత్ లైన్లు పోల్స్ తో పాటు అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు విరిగి కింద పడ్డాయి.

 

గాలివానకు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి నష్టం జరిగింది. పలు గ్రామాల్లో ఎల్టీ లైనులు తెగిపడడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

 

ALSO READ : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

కనగల్ మండల కేంద్రంలో కనగల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 11 కెవి లైన్ పై చెట్లు చెట్లు విరిగిపడడంతో విద్యుత్ ఏఈ రాజశేఖరచారి అక్కడకు చేరుకుని సిబ్బందితో చెట్లను తొలగించి కరెంటు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

 

పలుచోట్ల రేకుల షెడ్లు, డబ్బాలు గాలివానకు కింద పడ్డాయి. దశాబ్ద కాలంగా ఇంతటి గాలిని ఎన్నడూ చూడలేదని కనగల్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాలివానకు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

మరిన్ని వార్తలు