Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

Minister Sabitha : మంత్రి సబితమ్మకు ఘోర పరాభవం

Minister Sabitha : మంత్రి సబితమ్మకు ఘోర పరాభవం

ఒకపక్క మంత్రి పర్యటన – మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ సహా కౌన్సిలర్లు మంత్రి ఫ్లెక్సీ చించివేత

ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో చించి వేసిన ప్రజాప్రతినిధులు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పార్టీ ప్రచారం కోసమే

తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, కౌన్సిలర్లు

మహేశ్వరం, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఘోర పరాభవం జరిగింది.

 

Also Read : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

ఓ పక్క మంత్రి సబితమ్మ మహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో 13, 14, 15 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తుంటే ..

దశాబ్ది ఉత్సవాల్లో వేసిన ఫ్లెక్సీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థానిక మున్సిపల్ చైర్మన్ ఫోటో లేకపోవటంతో ఆగ్రహంతో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ కౌన్సిలర్లు, బాకీ విలాస్, రాజమోని రాజు, బోధ యాదగిరి రెడ్డి, జాపాల సుధాకర్, తుక్కుగూడ మున్సిపాలిటీ నిధుల నుండి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బిజెపి కౌన్సిలర్లు పూర్తిగా తొలగించారు.

 

మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో స్థానిక చైర్మన్ ఫోటో లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.
బిజెపి మున్సిపల్ కౌన్సిలర్లు నేతలు, ఆందోళన చేపట్టారు.

మున్సిపల్ కార్యాలయం ముందు తుక్కుగూడ శ్రీశైలం హైవేలో వేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించి తమ నిరసన తెలియజేశారు. ప్రజలు కట్టిన పన్నుతో దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చైర్మన్ అన్నారు.

 

 

పూర్తిగా దశాబ్ది ఉత్సవాలు పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం తప్ప మరొకటి లేదన్నారు. పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ప్రజల బుద్ధి చెప్తారన్నారు.

 

Also Read : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు