Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Pavan : పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక పోస్టులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!

Pavan : పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక పోస్టులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!

చౌటుప్పల్, మనసాక్షి:

జనసేనాని పవన్ కళ్యాణ్ కుటుంబం పై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని వెబ్సైట్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ మండల, పట్టణ అధ్యక్షులు పర్నే శివా రెడ్డి, తోర్పునూరి లింగస్వామి, జన సైనికులు సోమవారం స్థానిక చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పి శివారెడ్డి మాట్లాడుతూ..

గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై, ఆయన కుటుంబంపై అసభ్యకరమైన వార్తలు ప్రచారం చేస్తున్న తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో అధికారంలో ఉన్న వైసీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ..

 

ALSO READ : 

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

4. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో జనసేన పిర్యాదులు చేశారని అందులో భాగంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ధనుంజయకి పిర్యాదు అందజేశామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల అధ్యక్షులు పర్నే శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు తోర్పునూరి లింగస్వామి,పెద్దగొని లింగస్వామి, మర్ల శ్రీశైలం, గంగాపురం రాజశేఖర్, రావుల మల్లేశ్, మామిడి శివ, బొమ్మకంటి నరేశ్, సంగం చంద్ర శేఖర్, రంజిత్, శ్రీకాంత్, సుల్తాన్ రాజు, వెంకటేశ్, ఇంద్రపాల్ జన సైనికులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు