Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

గూగుల్ పే.. యూజర్లకు శుభవార్త తెలియజేసింది. గూగుల్ పే సంస్థ తమ యూజర్ల కోసం నూతన సదుపాయాన్ని తీసుకొచ్చింది. తక్కువ మొత్తంలో చెల్లింపులకు యూపీఐ లైట్ ( UPI Lite) ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ వల్ల 200 రూపాయల వరకు లావాదేవీలు చేయడానికి పిన్ నెంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు.

 

ఈ సదుపాయాన్ని ఇప్పటికే ఫోన్ పే , పేటీఎంలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కాగా గూగుల్ పే కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

2. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

4. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

 

యూపీఐ లైట్ వాలెట్ లోకి 2000 రూపాయల వరకు లోడ్ చేసుకోవచ్చును. పీక్ అవర్స్ లో కూడా లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గూగుల్ పే తెలియజేసింది. యూపీఐ లైట్ లావాదేవీల వల్ల బ్యాంకు పాస్ బుక్ లో కూడా చిన్న చిన్న లావాదేవీలు నమోదు కాకుండా ఉంటాయి. 15 బ్యాంకులు యూపీఐ లైటుకు ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నాయి.

 

యూపీఐ లైట్ ఎలా..?

గూగుల్ పే లో యూపీఐ లైట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు యాప్ లోని ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. కొంచెం కిందికి వస్తే అక్కడ యూపీఐ లైట్ యాక్టివేషన్ కు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది.

 

దానిపై క్లిక్ చేస్తే యూపీఐ లైట్ యాక్టివేషన్ కు కావలసిన సూచనలు పాటించి ఆక్టివేట్ చేసుకోవచ్చును. ఆ తర్వాత మీకు కావాల్సిన మొత్తాన్ని వాలెట్ లో లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు