Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Nalgonda | ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Nalgonda | ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నల్గొండ అర్బన్, మనసాక్షి:

ఉపాధ్యాయుల శ్రమ, అంకిత భావంతోనే నాణ్యమైన విద్యకు కేరాఫ్గా గురుకులాలు నిలుస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. అలాంటి గురుకులాలను తీర్చిదిద్దుతున్న గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు దశల పోరాట కార్యక్రమాలలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వద్ద సోమవారం టియస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా గురుకులాల ఉపాధ్యాయుల జిల్లా కన్వీనర్ జి. రాంబాబు అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలు నిర్వహించారు.

 

ఈ నిరసన దీక్షలో ఆయన పాల్గొని గురుకుల ఉపాధ్యాయుల దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు విజయవంతమైన నమూనాగా ఉన్నాయని, ఈ విజయాల వెనుక గురుకులాల ఉపాధ్యాయుల శ్రమ, అంకితభావం ఎంతో ఉందన్నారు. అయినా ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనం గానీ, కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదన్నారు.

 

ALSO READ :

 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

 

 

ఉపాధ్యాయులు శారీరక శ్రమతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. గురుకులాల అన్ని సొసైటీలలో ఏకరూప పరిపాలన అమలు చేయాలని, అన్ని సొసైటీల బోధన సమయాన్ని ఒకే విధంగా ఉండేలా మార్చాలని, అన్ని గురుకులాల్లో బదిలీలు- పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్లను ప్రత్యేకంగా నియమించి ఉపాధ్యాయులను నైట్ డ్యూటీ ల నుంచి మినహాయించాలన్నారు.

 

కాంట్రాక్టు, గెస్ట్, పార్ట్ టైం, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు బేసిక్ పే, 12 నెలల వేతనం కల్పించాలని, సీఆర్టీల సర్వీస్ రెగ్యులర్ చేయాలని, అన్ని గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతిథులుగా టిఎస్‌ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం. రాజశేఖర్ రెడ్డి, జి. నాగమణి పాల్గొని గురుకులాల ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గురుకులాలలో నాణ్యమైన విద్యకు దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, గురుకుల ఉపాధ్యాయులు రాధా, శివ, శశిధర్, జ్యోతి బాబు, సంజయ్ కుమార్, మధు, నాగరాజు, ఉపేందర్, సునీల్, వెంకట్, ప్రసాద్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు