Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
మనసాక్షి , వెబ్ డెస్క్ :
పుష్ప సినిమా జాతీయస్థాయిలో అవార్డులు దక్కించుకొని తగ్గేదేలే దని నిరూపించింది. పుష్ప సినిమా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పు పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా సంబరాలు సంబరాలు అంటుతున్నాయి.
ఇది కేవలం పుష్ప యూనిట్ కు మాత్రమే కాకుండా తెలుగు చిత్రసీమకే గర్వకారణంగా చెప్పుకోవచ్చును. ఇప్పటివరకు ఏ తెలుగు సినీ నటుడు కూడా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఈ అవార్డును సాధించి టాలీవుడ్ ను ఉన్నత స్థాయిలో నిలిపాడు.
ALSO READ :
- RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!
- మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
- సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
- దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా దర్శకుడు సుకుమార్ ని కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఈ అవార్డు రావడానికి కారణం పుష్ప క్యారెక్టర్ ను అద్భుతంగా మలిసిన వారిలో సుకుమార్ పాత్ర కీలకంగా ఉంది. సుకుమార్ ని పట్టుకొని ఆనంద భాష్పాలు తో గట్టిగా ఏడ్చిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది. పుష్ప నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ , బన్నీ భార్య స్నేహ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవార్డు రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కు అవార్డు దక్కడంతో “తగ్గేదే లే “దని నిరూపించాడని ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. పుష్ప – 2 మరింత ప్రభంజనం సృష్టించేందుకు ఈ అవార్డు ద్వారా దోహద పడుతుందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ పుష్ప ది రైస్ సినిమాలో నటించి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ హీరోగా అవార్డు దక్కడం తెలుగు ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. జాతీయస్థాయి అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.
Maverick director @aryasukku and our producers #NaveenYerneni garu and #RaviShankar garu shower their happiness and love on Icon Star @alluarjun for becoming THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#Pushpa ❤️🔥#ThaggedheLe pic.twitter.com/RvxX7NbKnM
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023










