Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

చింతపల్లి. సెప్టెంబర్ 20 మనసాక్షి.

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయిన సంఘటన చింతపల్లి మండలం లో బుధవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ తన భార్య కుమారుడుతో కలిసి మోటార్ బైక్ పై మల్లేపల్లి వైపు వెళ్తున్నారు.

మల్లేపల్లి నుండి హైదరాబాద్ వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న మోటార్ బైకును ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ప్రసాదు (38) అతని కుమారుడు అవినాష్ (12) అక్కడికక్కడే మృతిచెందగా ప్రసాద్ భార్య మద్దిమడుగు రమణ (35) అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో డ్రైవర్ పట్నపు మణిపాల్ (18), వనం మల్లికార్జున్ (18) మృతి చెందారు.

ALSO READ : బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సు పల్టీ ఇద్దరు మృతి,  పలువురికి గాయాలు..!

చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి పివిఆర్ ఫామ్ హౌస్ సమీపంలోని మూల మలుపు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పులి పవన్, వారాల మనివర్ధన్, లకు తీవ్రంగా గాయాలయ్యాయి . దీంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం చింతపల్లి పోలీసులు స్థానికుల సహాయంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Accident News : లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మరిన్ని వార్తలు