Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!

రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!

హైదరాబాద్ , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహణపై తెలంగాణ ఐటి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్లో ఆయన కామెంట్స్ పోస్ట్ చేశారు.

ఎన్టీఆర్ కామెంట్స్ యధావిధిగా.

కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.

గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు.

కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది.
మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది.

కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా
ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు.

రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ..
తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది.

ALSO READ : రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి
తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..

కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్.
కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..
ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ??

దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను
కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు…
ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి
అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది.

శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు
ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు.

ALSO READ : నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే..
వందల మంది బలిదానాలకు కారణం.

నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా..
తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్

గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే..
తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.
టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న
రాబందు… రేవంతు..

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ??
రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..

మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది..
మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది.

మూడు రోజుల పర్యటన చేసినా..
మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు.
వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు.

మరిన్ని వార్తలు