Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంహైదరాబాద్

Congress Second List : నేడు కాంగ్రెస్ రెండవ జాబితా..?

Congress Second List : నేడు కాంగ్రెస్ రెండవ జాబితా..?

ఢిల్లీలో సిఈసి సమావేశం

సమావేశం అనంతరం రెండవ జాబితాను విడుదల చేసే అవకాశం

హైదరాబాద్, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాపై సర్వత్ర ఉత్కంఠత నెలకొన్నది. రెండవ జాబితాను విడుదల చేసేందుకు తెలంగాణ నేతలు ఢిల్లీ పెద్దలతో కలిసి చర్చలు నిర్వహిస్తున్నారు. (శుక్రవారం) నేడు ఢిల్లీలో సిఇసి సమావేశం నిర్వహించనున్నారు. గురువారం జరగనున్న సమావేశం కాస్త వాయిదా పడి శుక్రవారం జరగనున్నది. సమావేశంలో పూర్తిస్థాయిలో రెండవ జాబితా అభ్యర్థులపై చర్చించి అనంతరం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయిన నాయకులు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరే విధంగా ఉన్నందున.. ఆ పార్టీ నేతలు గ్యారెంటీ పథకాలే తమను గ్యారెంటీగా గెలిపిస్తాయని నమ్ముతున్నారు.

ALSO READ : Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 55 మంది తో మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరంతా ఆయా నియోజకవర్గాలలో ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.

రెండవ జాబితా పై కసరత్తు పూర్తి :

కాంగ్రెస్ పార్టీ మరో 64 నియోజకవర్గాల తో రెండవ జాబితాను సిద్ధం చేయటానికి కసరత్తు నిర్వహిస్తుంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో మకాం వేసి ఇప్పటివరకు 50 స్థానాలపై చర్చించారు. దాదాపుగా 50 స్థానాలలో అభ్యర్థుల ఖరారు అయినట్లు సమాచారం. మరో 10 స్థానాల్లో మరోసారి చర్చించిన అనంతరం జాబితాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

ఖరారు కానీ వామపక్షాల సీట్లు :

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో వామపక్షాల పార్టీలు అవగాహన కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు సీట్లు కేటాయిస్తే కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి వామపక్ష పార్టీలకు ఇంకా కొలిక్కి రాలేదు. శుక్ర వారం జరగనున్న సమావేశంలో వామపక్షాల సీట్ల కేటాయింపు పై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు