Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజయశంకర్ భూపాలపల్లి జిల్లాజాతీయంజిల్లా వార్తలుతెలంగాణ

Medigadda : మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. బ్యారేజీ సందర్శించిన రాహుల్..!

Medigadda : మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. బ్యారేజీ సందర్శించిన రాహుల్..!

మేడిగడ్డ బ్యారేజ్ , మన సాక్షి :

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గురువారం 144 సెక్షన్ ను అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కూలిన మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించేందుకు వెళ్తున్న విషయం తెలుసుకున్న అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు.

కాగా రాహుల్ గాంధీ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని సందర్శించారు. ఆయనతో పాటు కేవలం 6 మందికి మాత్రమే బ్యారేజీ సందర్శనకు అవకాశం కల్పించారు. కాగా ఆయనతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. రాహుల్ గాంధీ తో పాటు ఇతర నేతలు మేడిగడ్డ బ్యారేజ్ కూలిన పిల్లర్లను పరిశీలించారు.

ALSO READ : ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి : ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

అనంతరం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరిమిత సంఖ్యలో అనుమతి కల్పించారు. అయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మేడిగడ్డ బ్యారేజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

దాంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే కుప్పకూలటం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టుకు విడుదల చేసిన డబ్బులు సగం దోచుకోవడం వల్లే నాణ్యత లేకుండా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్ షా.. అవినీతిపై మోడీ చర్యలు తీసుకోలేదన్నారు.

ALSO READ : సూర్యాపేట : బి ఎస్ పి సర్పంచ్ కిడ్నాప్ కు యత్నం

రాకపోకలు నిలిచిపోయాయి :

అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. బ్యారేజీకి చెందిన రెండు పిల్లర్లు కూలిపోయాయి. ఈ బ్యారేజీ పైనుంచి తెలంగాణ – మహారాష్ట్రలకు రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా బ్యారేజీ కుంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు