Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసినిమాహైదరాబాద్

Big Boss7 Telugu :  బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్..!

Big Boss7 Telugu :  బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

బిగ్ బాస్ బుల్లితెర రియాలిటీ షో తెలుగు – 7 విజేతగా పల్లవి ప్రశాంతు నిలిచారు. 105 రోజులపాటు బిగ్ బాస్ -7 ఉల్టా పల్టా అంటూ ఊహించని ట్విస్టులతో సాగింది. 19 మంది కంటెస్టెంట్లతో సాగిన ఈ బిగ్ బాస్ షో చివరకు అమర్, ప్రశాంత్ మిగలగా అందరి అభిమానాన్ని పల్లవి ప్రశాంత్ గెలుచుకొని విజేతగా నిలిచాడు.

షోలో మొత్తం ఆరుగురు ఫైనల్ లిస్టులుగా ఉండగా మొదట అంబటి అర్జున్, ఆ తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయ్యారు. ఇక యావర్ 15 లక్షల బ్రీఫ్ కేస్ తో బయటికి రాగా టాప్ త్రీ లో ఉన్న శివాజీ బయటకు వచ్చాడు.

ALSO READ: Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

మొత్తం 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో అఖిల , ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజు, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అర్జున్ , పూజ మూర్తి, బోలే షావాలి, అశ్విని, నైని , పావని, ప్రియాంక , శివాజీ , యావర్, దామిని, ఉన్నారు.

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

వారిలో 14 మంది కంటెంట్లు బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే ఎంట్రీ ఇవ్వగా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో అంబటి అర్జున్, నయని పావని, పూజ , అశ్విని శ్రీ, బోలే షావలి ఉన్నారు. 105 రోజులపాటు ఎంతో అట్టహాసంగా సాగింది.

బిగ్ బాస్ 7 ఏదిఏమైనా చివరి దశ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరుగురు కంటెస్టెంట్ మాత్రమే మిగిలారు అమర్దీప్ , పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అర్జున్, యావర్లు మిగిలారు .ఆ సమయంలో బిగ్ బాస్ మరింతగా అందరినీ ఆకట్టుకుంది. చివరగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ -7 టైటిల్ విన్నర్ గా నిలిచారు.

మరిన్ని వార్తలు