Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!

Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫైలు పై సంతకం చేశారు.

దానిని వెంటనే డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణంలో ప్రభుత్వం కొన్ని కండిషన్లను పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయితేనే ఫ్రీ బస్సు ఉంటుందని స్పష్టం చేసింది. అందుకు వారి ఆధార్ కార్డులను కండక్టర్ కు చూపిస్తే.. జీరో టికెట్ కొడతాడని ప్రకటించింది.

ALSO READ : రేషన్ కార్డు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎమ్మెల్యే బత్తుల వెల్లడి..!

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్రం దాటితేనే టికెట్ తీసుకోవాల్సి ఉంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మహిళలు అత్యధికంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. ఇదిలా ఉండగా మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారని, ఆటోవాలాలు.. నష్టపోతున్నారని వారు ధర్నాలు సైతం చేశారు.

అద్దె బస్సుల యజమానులు కూడా సమ్మె సైరన్ : 

ఇదిలా ఉండగా తాజాగా ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కూడా సమ్మె సైరన్ మోగించారు. ఉచిత బస్సు స్కీం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రైవేట్ బస్సు యజమానులు పేర్కొంటున్నారు. ఉచిత బస్సు సదుపాయం సక్సెస్ గా నడుస్తున్న సమయంలో ప్రైవేట్ బస్సు యజమానులు సమ్మె సంకేతాలు వినిపిస్తున్నాయి.

ALSO READ : Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!

ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టిసి అద్దె బస్సు యజమానులు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు తమ బస్సులలో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారని దానివల్ల తమ బస్సులు పాడవుతున్నాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సు యజమానులు ప్రయాణికుల సంఖ్య పెరగటం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

కాబట్టి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని, లేదంటే ఐదవ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యజమానులు హెచ్చరించారు.

ALSO READ : Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!

మరిన్ని వార్తలు