Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ఫ్లాష్.. ఫ్లాష్.. రంగారెడ్డి జిల్లాలో దారుణం..!

ఫ్లాష్.. ఫ్లాష్.. రంగారెడ్డి జిల్లాలో దారుణం..!

షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తుంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిఘా పెట్టిన ఎస్ఓటి పోలిసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో, డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి.

ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పూర్తి దర్యాఫ్తు తర్వాతే వివరాలు గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావును

వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, కేసును పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ALSO READ : BREAKING : కూరగాయల ట్రేలతో రవాణా.. పోలీసుల తనిఖీల్లో నల్గొండ జిల్లాలో బయటపడ్డ స్మగ్లింగ్..!

మరిన్ని వార్తలు