Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!

Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!
నల్గొండ , మన సాక్షి :

మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో అధిక వడ్డీ ఆశా చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులని మోసం చేస్తున్న కేసులు ఈ మధ్య కాలంలో చాలా నమోదు అవుతున్నాయి అని జిల్లా యస్.పి చందనా దీప్తి తెలిపారు.

బుధ వారం యస్.పి మీడియా తో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారు. జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు,మెసేజ్ లు క్లిక్ చేయకూడని, నకిలీ వెబ్ సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారు,

ALSO READ : Nalgonda : సమస్యల పరిష్కారానికి వెంటనే ఫోన్ లోనే ఆదేశాలు జారీ చసిన మంత్రి కోమటిరెడ్డి..!

అంతే కాకుండా వైద్య సహాయం,పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారు అని, లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని లేని యెడల హెల్ప్ లైన్ నంబర్ 1930 కానీ 155260 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.

ALSO READ : Guntur karam : గుంటూరుకారం సినిమా విలన్స్ పేర్లలో వివాదం.. ఆందోళనలకు సిద్ధం..!

సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు.
సెల్ ఫోన్లు కు వచ్చే కేవైసి అప్డేట్ మెసేజ్లు,బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని చెప్పే మాటలు నమ్మకూడదు. బహుమతులు వస్తాయంటు పంపే లింకులు క్లిక్ చేయకూడదు
సోషల్ మీడియా వేదికగా ఎవరికి బ్యాంకు యొక్క ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు ఓటిపి లు తెలియ చేయ కూడదు.

మరిన్ని వార్తలు