Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లారాజకీయం

BREAKING : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిక..!

BREAKING : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిక..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇటీవల సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు మరింత గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.

వారితోపాటు మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా పార్టీ మారుతారా అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైన సంగతి విషయమే. ఇదిలా ఉండగా మరో బిగ్ షాట్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనం కలిగించే అంశంగా మారింది.

ALSO READ : ఉచిత విద్యు త్ కావాలంటే ఆధార్ తో పాటు ఇవి ఉంచుకోండి.. నేటి నుంచి ఇంటి వద్దకే విద్యుత్ అధికారులు..!

పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ (బీఆర్ఎస్) వెంకటేష్ నేత, టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి నుంచి మరోసారి కెసిఆర్ తనకు అవకాశం కల్పించే వీలు లేదని భావించి పార్టీ మారినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఏఐసీసీ సెక్రెటరీ (ఆర్గ్) వంశీ చంద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ALSO READ : ఒకే గదిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థినిలు ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు