Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BRS – BSP : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పి పొత్తు..!

BRS – BSP : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పి పొత్తు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు దాదాపు ఖరారు అయింది. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కలిసి సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో వీరి సమావేశం కీలకంగా మారింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నది.

పొత్తుల విషయంపై ఇరు పార్టీల అధ్యక్షులు అంగీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ , బిజెపి వల్ల ప్రమాదం పొంచి ఉన్నదని బీఆర్ఎస్, బీఎస్పి పొత్తు పెట్టుకోనున్నట్లు తెలిసింది. పొత్తుల విషయంపై రేపు బీఎస్పి అధినేత్రి మాయావతి తో మాట్లాడనున్నట్లు కేసిఆర్ పేర్కొన్నారు.

బీఎస్పీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా బిజెపి లాగానే మారుతుందన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల పొత్తు ఖరారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ALSO READ : Telangana : ముగిసిన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. నరేంద్ర మోడీకి రేవంత్ వీడ్కోలు..!

మరిన్ని వార్తలు