BRS, BSP : బీఆర్ఎస్ , బీఎస్పీ పొత్తు.. సీట్ల పంపకం కుదిరింది..!
BRS, BSP : బీఆర్ఎస్ , బీఎస్పీ పొత్తు.. సీట్ల పంపకం కుదిరింది..!
హైదరాబాద్ , మన సాక్షి :
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి టి
(బీఆర్ఎస్) తో బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల అధినేతలు పొత్తు గురించి చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా లోకసభ ఎన్నికల్లో సీట్ల పంపకం కూడా కుదిరింది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. కాగా వాటిలో బహుజన సమాజ్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు కేటాయిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పదకొండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించింది. బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాలను వారికి కేటాయించింది. నాగర్ కర్నూల్ ఎంపీగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా హైదరాబాద్ స్థానం నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ALSO READ :
Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!
DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!
ACB : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..!
Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!
BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!









