Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిసూర్యాపేట జిల్లా

Suryapet : కవిత అరెస్టుకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాస్తారోకో..!

Suryapet : కవిత అరెస్టుకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాస్తారోకో..!

సూర్యాపేట, మనసాక్షి

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కాంగ్రెస్ బిజెపిలు ఒకటై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం దుర్మార్గమని యావత్ తెలంగాణ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ శనివారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ శ్రేణులు రాసారోకో నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేక మోడీతో చేతులు కలిపి దొంగ నాటకాలు ఆడుతూ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గతంలో ఎలాంటి కేసులతో కవితకు సంబంధం లేదని చెప్పి నేడు అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడి అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని ట్రాఫిక్కు క్లియరెన్స్ చేయడం హుటాహుటిన ఢిల్లీకి తరలించడం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందన్నారు.

కాంగ్రెస్ కుట్రపూరితంగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు పెడుతూ ఈ డి ఐ టి దాడులను చేయిస్తూ టిఆర్ఎస్ ను ఖతం పెట్టాలని చూస్తుందన్నారు. టిఆర్ఎస్ ఎవరికి లొంగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ బిజెపిల కుట్రలను ఎదుర్కొంటామని భవిష్యత్తులో టిఆర్ఎస్ నాయకులపై ఎలాంటి కుట్రలు చేసిన తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జడ్పిటిసి జిడి బిక్షం, సూర్యాపేట టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, ఆకుల లవకుశ, బంటు చొక్కాయ, గుండగాని నాగభూషణం, అనిల్ రెడ్డి, షేక్ సయ్యద్, షకీల్, శ్రావణ్, మహిళా నాయకురాలు సల్మా, కర్ణ శ్రీ,అంజమ్మ,మల్లేశ్వరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు