Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయం

Governor Tamilisai : గవర్నర్ తమిళి సై రాజీనామా అందుకేనా..?

Governor Tamilisai : గవర్నర్ తమిళి సై రాజీనామా అందుకేనా..?

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామా ఎందుకు చేశారు..? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మూడు సంవత్సరాల పాటు ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో డి అంటే డి అనుకున్న సమయంలో కూడా ఆమె రాజీనామా చేయాలని భావించలేదు. ఇప్పుడు రాజీనామాకు కారణం ఏంటి లోకసభ ఎన్నికల నగారా మోగింది. దాంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..? తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగలాలనుకుంటున్నారా..? అనే టాక్ నడుస్తుంది.

2019 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళసై వచ్చారు. ఆమె తొలి మహిళా గవర్నర్ కూడా కావడం విశేషం. మూడేళ్లపాటు ఆమె గవర్నర్ గా కొనసాగారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో డీ అంటే డీ అని వ్యవహరించారు. రాజభవన్ లో ప్రజా దర్బార్ కూడా ఆమె నిర్వహించారు. ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తొలి గవర్నర్ గా ప్రసిద్ధి చెందారు. ఇది ఇలా ఉండగా ఆమె రాజీనామా వెనుక బలమైన కారణం ఉందని చెప్పవచ్చును.

తమిళనాడు లోకసభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిల లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నాడర్ సామాజిక వర్గానికి చెందిన తమిళసై తిరునల్వేలి, కన్యాకుమారి, చెన్నై సౌత్ నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తుంది.

ALSO READ : BIG BREAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించనున్న విమానంకు సాంకేతిక లోపం..!

మరిన్ని వార్తలు