Admissions : ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తుల స్వీకరణ..!
Admissions : ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తుల స్వీకరణ..!
రామసముద్రం, మన సాక్షి:
మండలంలోని ఊలపాడు పంచాయతీ దిన్ని పల్లెసమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
పదవ తరగతి అర్హత ఉన్న విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎం. మునిస్వామి నాయక్ మార్చి 22న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చుఅని ఆయన తెలిపారు.
పదవ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్థులు నిర్ణీత తేదీ నుంచి ఆన్లైన్లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు.
ALSO READ :
Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!
Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!
Liquor : బారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్..!









