Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Hareesh Rao Pa Arrest : హారీష్ రావు పిఏ అరెస్ట్..!

Hareesh Rao Pa Arrest : హారీష్ రావు పిఏ అరెస్ట్..!

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు

దుబ్బాక,  మనసాక్షి :

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తితో సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీసులో అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసినట్లు సమాచారం. మెదక్‌ జిల్లా పీర్లతండాకు చెందిన రవినాయక్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నరేశ్ కుమార్, కొర్లపాటి వంశీ, వెంకటేష్‌గౌడ్, ఓంకార్‌లను అరెస్ట్ చేశారు.

 

మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవి నాయక్‌ భార్య లలితా 2022లో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది. ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో రూ.5 లక్షలు బిల్లు కావడంతో 2023లో రవి సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల సచివాలయానికి వచ్చి అతను ఆరా తీశాడు. అయితే రెండు చెక్కుల ద్వారా రూ.87,500 వచ్చినట్లు అధికారులు రవి ఘనాయక్‌కు చెప్పారు.తన విజ్ఞప్తికి స్పందన రాక ఇబ్బందులు పడుతుంటే, తన పేరు మీద అప్పటికే ఎవరో చెక్కు తీసుకుని డబ్బు డ్రా చేశారన్న విషయం తెలిసి ఏదో గందరగోళం జరిగిందని రవి భావించాడు.

 

ఈ క్రమంలోనే ఆరా తీయగా గతంలో మంత్రి హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన నరేశ్‌, ఓంకార్ సాయంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5 లో చెక్కులు డ్రా చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21వ తేదీన జూబ్లీహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 417,419,420, 120బి, r/w, 34IPC, 66(b), 66(c), ITA 2000-2008సెక్షన్ ల కింద కేసునమోదు అయ్యింది.

ALSO READ : KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

మరిన్ని వార్తలు