Big Breaking : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం..!
Big Breaking : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం..!
రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఆమనగల్లు రక్షక బట నిలయ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
కల్వకుర్తి నుంచి హైదరాబాదుకు అతివేగంతో వస్తున్న కారు ఆమనగల్లు మండల పరిధిలోని రాంనుంతల గ్రామ శివారులోకి రాగానే హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న రక్షకబటులు కారులో ఇరుకున్న మృతదేహాలను జెసిబి ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మృతులు హైదరాబాదులోనే కర్మన్ ఘాట్ కి చెందిన వరప్రసాద్ గౌడ్ (26), నిఖిల్ (26), మణిదీప్(26) గా గుర్తించారు.
ALSO READ :
Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!










