Nalgonda : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలి..!
Nalgonda : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలి..!
కొండ మల్లేపల్లి,, మన సాక్షి:
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండ మల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఈ రోజు స్థానిక ఆటో డ్రైవర్లు అందరికి కొండ మల్లేపల్లి చౌరస్తాలో స్థానిక ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఆర్.సి. కలిగి ఉండాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని అన్నారు.
అదే విధంగా రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఆటోలను వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలని, రోడ్డుపక్కల ట్రాఫిక్కు అంతరాయం కలిగే విధంగా పార్కింగ్ చేస్తే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని వారిని హెచ్చరించారు. మండల ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి ప్రజలందరిని కోరారు.
ALSO READ :
Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!









