Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ లను ఏర్పాటు చేయడంపై గురువారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాలలో ఈ మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. క్యాంటీన్ల నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. కేరళ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ ల పేరుతో, బెంగాల్లో దీదీకర సొయ్ పేరుతో నిర్వహిస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు ఆమె తెలియజేశారు.

రాబోయే రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్యాంటీన్లకు నిర్వహణకు ఏర్పాటుకు ఎంత స్థలం కావాలి రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రణాళికలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లను ఆమె ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు