BREAKING : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..!
BREAKING : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..!
కనగల్, మన సాక్షి:
నల్గొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని బాబాసాహెబ్ గూడెం స్టేజి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కనగల్ ఎస్సై బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…
నిడమనూరు మండలం గోవిందన్నగూడెంకు చెందిన కొండ కృష్ణయ్య, అతని కుమార్తె అనిత ఇరువురు బైక్ పై స్వగ్రామం నుంచి నల్లగొండ వైపు వస్తుండగా సాగర్ తిరుమలగిరికి చెందిన బత్తుల పవన్ కుమార్ స్వగ్రామం నుంచి నల్లగొండ వైపు వస్తూ వెనక నుండి అతివేగంగా కృష్ణయ్య బైకును ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బత్తుల పవన్ కుమార్ (23) తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. కొండ అనిత (22) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఇదే ప్రమాదంలో కృష్ణయ్య సైతం తీవ్రగాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ALSO READ :
WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!
BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!









