Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

E- Office : ఈ – ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగించాలి..!

E- Office : ఈ – ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగించాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రభుత్వ కార్యాలయాలలో కాగిత రహిత ( ఈ – ఆఫీస్) కార్యకలాపాలను కొనసాగించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా నూతన కలెక్టర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించగా, మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ కు తమ తమ పేర్లు, నిర్వహిస్తున్న శాఖల గురించి సంక్షిప్తంగా తెలిపారు. ఈ పరిచయ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

గత కలెక్టర్ మాదిరిగానే తాను కూడా అందరూ అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా అధికారుల్లో చాలా మంది సీనియర్ అధికారులు ఉండటం పరిపాలన పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక నుంచి మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ చేస్తామని ఆమె పేర్కొన్నారు.

అంతకు ముందు కలెక్టర్ ను పరిచయం చేసుకున్న జిల్లా అధికారులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి పనులు, ప్రభుత్వ లక్ష్యం, ప్రస్తుత స్థితి పై కలెక్టర్ కు నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్త ల్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏవో నర్సింగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING : నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్..!

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

మరిన్ని వార్తలు