Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణసంక్షేమం

Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!

Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!

మన సాక్షి, ఫీచర్స్:

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ప్రయోజనం కోసం, వారు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేసే కొత్త పథకం ప్రారంభమైంది. ఈ పథకంలో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్ ను ఉచితంగా అందజేయనున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం పేరు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన:

ఇది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తుంది. ఈ పథకం 2023 ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల రుణాల సౌకర్యాలను కల్పిస్తుంది. దానికి కొన్ని శిక్షణలు కూడా అందిస్తుంది.

ఉచిత శిక్షణ :

ఈ పథకం కింద నిరుపేదలకు రెండు రకాల రుణాలతో పాటు శిక్షణ కూడా అందుతుంది. ఐదు నుండి ఏడు రోజులపాటు శిక్షణ ఇస్తారు మరియు 15 రోజుల శిక్షణకు 500 రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తారు. అదేవిధంగా అన్ని శిక్షణలు పూర్తయిన తర్వాత 15 వేల రూపాయల విలువైన టూల్ కిట్లను అందజేస్తారు. విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చును.

ఈ సంస్థలకు రుణాలు అందుబాటులో ఉన్నాయి :

మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి రుణం పొందనున్నారు. మీకు వ్యాపారం ప్రారంభించే ప్రణాళిక ఉంటే విశ్వకర్మ యువజన కింద మీకు మూడు లక్షల వరకు రుణం లభిస్తుంది. 18 రకాల వ్యాపారాలకు రుణాలు పొందవచ్చును. విశ్వకర్మకు సంబంధించిన కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు, శిల్పులు, కుమ్మరులు, బట్టల వ్యాపారులు, స్వీపర్లు, క్షురకులు, చెప్పులు కుట్టేవారు, బొమ్మలు తయారు చేసేవారు, చేపల వలలు నేసేవారు ఇలా అన్ని ఉద్యోగాలకు రుణ సదుపాయం పొందవచ్చును.

ఉచితంగా కుట్టు మిషన్ :

అదేవిధంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు ఉచిత కుట్టు మిషన్లను అందిస్తుంది. మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకో వచ్చును. కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. కాబట్టి ఒక కుట్టు మిషన్ యంత్రాన్ని కొనుగోలు చేసి మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును.

అర్హతలు :

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ లేదు. కాబట్టి మీరు కూడా దరఖాస్తు చేసుకో వచ్చును. 18 నుంచి 40 సంవత్సరాల లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మహిళా వార్షిక ఆదాయం 12 వేల రూపాయల లోపు ఉండాలి. ఈ లింకును www.pmvishwakarma.gov.in సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

 

ALSO READ : 

SURYAPET : సూర్యాపేటలో అరుదైన జాతి పాము.. భయభ్రాంతులకు గురైన ప్రజలు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్స్ స్నాచర్..!

WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!

మరిన్ని వార్తలు