Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : ఈజీగా డబ్బులు సంపాదించడం లక్ష్యం..!

Narayanpet : ఈజీగా డబ్బులు సంపాదించడం లక్ష్యం..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో మరియు మద్దూర్ మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించడం జరిగింద జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు.

మంగళవారం సాయంత్రం నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం విలేకరులతో మాట్లాడుతూ నిందితుల వివరాలు వెల్లడించారు. ఈనెల 24న సాయంకాలం సమయములో కోస్గి పోలీసులు శివాజీ చౌరస్తా లో నాకా బందీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదముగా కనిపించగా ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా కోస్గి పట్టణ ఎస్సై నరేష్ మరియు వారి సిబ్బంది ఆద్వర్యములో అట్టి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

వారిని కోస్గి పోలీసు స్టేషన్ కి తీసుకు వచ్చి విచారించగా గండీడ్ మండలం ఓర్వాల్ గ్రామానికి చెందిన గడ్డమీది రామకృ,నంచెర్ల శ్రీను అదే మండలం సాలనగర్ గ్రామానికి చెందిన గజ్జి రమేశ్ అలియాస్ పల్లె రమేశ్ ముగ్గురు కలిసి గత కొద్ది సంవత్సరాలుగా మద్యము కు బానిసలై జల్సాలు చేయుటకు అలవాటుపడి సులభముగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో వారు ముగ్గురూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ దొంగతనము చేసిన సొమ్మును అమ్ముకొని వచ్చిన డబ్బులను ముగ్గురూ సమానముగా పంచుకుంటూ మద్యం త్రాగుతూ జల్సాలు చేసేవాళ్ళు.

అట్టి క్రమములోనే పైన తెలిపిన ముగ్గురు కోస్గి మరియు మద్దూర్ పోలీసు స్టేషన్ ల పరిదిలో వారు చేసిన దొంగతనాలను కోస్గి పోలీసులు చేసిన విచారణలో ఒప్పుకున్నారు.

వారి వద్ద నుండి 4.7 కే‌జి ల వెండి ఆభరణాలు, 44 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు 1,50,500/- రూపాయల క్యాష్, బోర్ మోటర్లు, సీలింగ్ ఫ్యాన్స్, వైర్ బండేల్స్ మేకలు మరియు పొట్టేల్లు డెల్ కంపెనీ సంబందించిన సిపియు, 32 ఇంచుల సాంసంగ్ టి‌వి ప్రింటర్ స్వాదీన పరుచుకొని నిందితులను కోర్టు ముందు హాజరు పరి చి కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలుకు పంపించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

పట్టుబడిన వస్తువుల విలువ మొత్తం రూ/- 9,75,000 ఉంటుందని ఎస్పీ తెలిపారు. 9 కేసులను ఛేదించిన పోలీసులను కోస్గి సిఐ సోమ నర్సయ్య, ఎస్సై బాల వెంకటరమణ, కానిస్టేబుల్ అంజలయ్య లను ఎస్పీ అభినందించి రివార్డు ఇవ్వడం జరిగింది.

ALSO READ : 

Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు