BREAKING: పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కన్నుమూత.. పలువురు సంతాపం.!
BREAKING: పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కన్నుమూత.. పలువురు సంతాపం.!
హైదరాబాద్ మనసాక్షి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ (83) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు.
1948 సెప్టెంబర్ 25 న జన్మించారు. నిజామాబాద్ నుంచి 1989, 1999, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక పర్యాయం ఎంపీగా పనిచేశారు.
2009లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ లో కీలక పాత్ర పోషించారు.
2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. రాజ్యసభ సభ్యునిగా చేశారు, కానీ 2019లో పక్కన పెట్టారు.2023లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆరోగ్య కారణాలను చూపుతూ మరుసటి రోజే రాజీనామా చేశారు.
ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ కొనసాగుతుండగా పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా గతంలో పనిచేశారు.
డియస్ మృతికి పలువురు సంతాపం :
పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాసులు పట్ల పలువురు సంతాపం తెలిపారువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు సంతాపం తెలిపారువ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
ALSO READ
BREAKING: నల్గొండ జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు.. కేసులు నమోదు..!
Hyderabad : హైదరాబాదులోని ప్రధాన ఫ్లై ఓవర్ ల గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే చూడండి..!









