Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి కృతనిచ్చేయంతో ఉంది. ఉద్యోగాలు కోసం గత ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలకు కూడా ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించింది.

కొత్తగా డీఎస్సీ నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పరీక్షల షెడ్యూల్ కూడా జారీ చేసింది. దాంతో డీఎస్సీ పరీక్షలు చదువుకునేందుకు సమయం లేదని, తక్కువ సమయంలో పరీక్షలు పెడితే ఎలా? అంటూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని కోరడం విచిత్రంగా అనిపిస్తుంది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

ఆయన ధర్నాలు చేస్తున్న వారి పరీక్షలు హాల్ టికెట్లు పరిశీలించాలని ఉన్నతాధికారులను కోరగా వారు ఎలాంటి పరీక్షలు రాయడం లేదని, అందులో ఒకరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులని, అతనికి పరీక్షలు వాయిదా వేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ లో పేర్కొన్నది.

వీడియో

ఇవి కూడా చదవండి: 

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!

మరిన్ని వార్తలు