Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

SURYAPET : నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.. ఇద్దరు నిందితుల రిమాండ్..! 

SURYAPET : నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.. ఇద్దరు నిందితుల రిమాండ్..! 

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట పట్టణం లో 11 లక్షల విలువగల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనంచేసుకొని కేసు నమోదు, ఇద్దరు నిందితుల రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ తెలిపారు.

సోమవారం ఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో కేసు వివరాలను ఎస్పి సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఎస్పి మాట్లాడుతూ జులై 14.తేది న తెల్లవారుజామున నమ్మదగిన సమాచారము మేరకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బంది తో కలిసి సూర్యపేట పట్టణములోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద వాహానాలను తనిఖీ చేస్తుండగా , రెండు ఆటొలు అనుమానస్పదముగా వస్తుంటే , అట్టి వాహనాలను ఆపి తనిఖీ చేశారు.

అట్టి రెండు ఆటొలలో ప్రభుత్వము వారు నిషేదించినటువంటి గుట్కా, ఖైని, టొబాకో ప్యాకెట్ లకు సంబందించిన బస్తాలు ఉన్నాయు అన్నారు., అట్టి వాహనాలతో పాటుగా, కూరగాయల మార్కెట్ నందు గల మంజు కిరాణము & బేకరీ షాప్ వద్దకు వెళ్ళి, షాప్ నందు తనిఖీ చేయడం జరిగిందని , ఆ షాప్ వెనకాల ఏర్పాటు చేసిన గది లో 6 లక్షల విలువగల గుట్కా, ఖైని, టొబాకో బస్తాలు ఉన్నట్లు గుర్తించారు.

అట్టివాటిని పట్టుబడిచేసి, షాప్ యజమానీ మాయదేవర శివసత్తి, గత కొంతకాలముగా కర్ణాటక ప్రాంతములో నుండి గుట్కా, ఖైని, టొబాకో లను కొనుగోలుచేసి, అట్టివాటిని సూర్యాపేట పట్టణముకి తీసుకవచ్చి, అతని షాప్ నందు ఉంచి, షాప్ వద్దకు వచ్చే కస్టమర్లకు అమ్ముతు డబ్బులు సంపాదిస్తున్నాడని వివరించారు.

నేరం సంఖ్య 331/2024 యు/ఎస్ 331/2024 యు/ఎస్ 223 బి.ఎన్ (188 ఐపీసీ ); సెక్షన్ 24(i) ఆఫ్ జిఓపివై ఏసీటి-2003 సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. ఆటో డ్రైవర్ యర్రంశెట్టి నవీన్,పై కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు.

ఈ కేస్ లో మొత్తం 11 లక్షల విలువగల గుట్కా ,2 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.. ప్రజలకు అనారోగ్యము కలిగించే గుట్కా, ఖైని, టొబాకో లను అమ్మినచో వారిపై చట్టరిత్య తగుచర్యలు తీసుకొంతమన్నారు. అక్రమ వ్యాపారులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పి విజ్ఞప్తి చేసినారు.ఇట్టి కేసును చేదించిన ఇన్స్పెక్టర్ జి . రాజశేఖర్ , ఎస్ ఐ మహేంద్రనాథ్ ని, పోలీస్ సిబ్బందిని అభినందించారు.ఈ సమావేశం లో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డీస్పీ రవి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Drugs : రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురు అరెస్టు, వారిలో ఇద్దరు నైజీరియన్లు..!

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!

ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!

మరిన్ని వార్తలు