రూ.లక్షలోపు 40 లక్షల మంది రైతులు.. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు..?
రూ.లక్షలోపు 40 లక్షల మంది రైతులు.. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు..?
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా రుణమాఫీ పై ప్రభుత్వం పై విమర్శలు చేశారు.
ట్విట్టర్ లో కేటీఆర్ విమర్శించిన అంశాలు:
రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్!
రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు.
హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు.
40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు?
2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా?
2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చింది.
2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు.
కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలి! అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలి.
ఇవి కూడా చదవండి :
Runamafi : నేడు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము.. ఊరూరా సంబరాలకు ఏర్పాట్లు..!









