Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత..!

Narayanpet : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా దగ్గర సోమవారం యూసుఫ్ తాజ్ కి చెందిన ఐబి కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

కిరాణా షాపులో నిషేధిత గుట్కా, జరదా, అంబర్ ప్యాకెట్లు అమ్ముతున్నారని పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్, టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 17,000/- రూపాయల విలువగల ప్రభుత్వ నిషేధిత అంబర్, జర్ధ గుట్కా ప్యాకెట్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి యూసుఫ్ తాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచిన, రవాణా చేసిన, ప్రజలకు అమ్మిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ALSO READ : 

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

Dial 100 : ప్రాణాలు కాపాడిన డయల్ 100..!

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

Miryalaguda : చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు.. భయాందోళనలో ప్రజలు..!

మరిన్ని వార్తలు