Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapally : పాపం.. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆ చిన్నారులకు తెలియదు..!

Nelakondapally : పాపం.. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆ చిన్నారులకు తెలియదు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

అమ్మా…. లేవమ్మా…. ఆకలి అవుతుంది… పాలు ఇవ్వమని చిన్నారులు తల్లి మృతదేహం పై పడి రోధిస్తున్న తీరు అందరిని కంట తడి పుట్టించేది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురతండా గ్రామానికి చెందిన భూక్యా రమ్య-రాజీవ్ గాంధీ దంపతులు నిరుపేదలు. వీరికి ఇరువురు కూతుర్లు ఉన్నారు. చిన్న కటుంబం కూలీ, నాలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

దానితోనే సంతోషంగా గడుపుతున్నారు. ఎవరికి కన్ను
గుటిందో ఏమో కానీ ఆకుటుంబంలో విషాదం అలుముకుంది.తల్లి రమ్య కు అన్యారోగ్యంతో బాధపడుతూ మంచం ఎక్కింది. భర్త అందినకాడికల్లా అప్పులు తెచ్చి వైద్యం చేయించినప్పటీకీ ఫలితం కనపడలేదు.

పరిస్థితి విషమంచి మంగళవారం రమ్య మృతి చెందింది. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు శాన్వి (6), సంగీత (4) లు తల్లి మృతదేహం పై పడి ఏడుస్తున్నా తీరు అందరిని కంట తడి పెట్టించేది.

ఆ చిన్నారులకు తెలియదు… తల్లి ఇక కానరాని లోకాలకువెళ్లిందని…వారు తల్లి కోసం ఎదురు చూస్తున్న తీరు తో పలువురు బోరున విలపిస్తున్నారు. చిన్నారుల బాధను చూడ లేక తండ్రి రోధిస్తున్న తీరు కలిచివేచింది.

ALSO READ : 

NALGONDA : వీరు మామూలోళ్లు కాదు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

BREAKING : నల్లగొండలో రూ.1.41 కోట్ల విలువైన గంజాయి దగ్దం..!

Khammam : సీతారాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మంత్రుల పూజలు..!

మరిన్ని వార్తలు