Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం గందరగోళంగా మారింది. అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ అందలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రుణమాఫీ అందరికీ రుణమాఫీ రాలేదని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పటికే మూడు విడతలుగా తెలంగాణ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేసింది.

ఇది ఇలా ఉండగా ఇంకా లక్షలాదిమంది రైతులు తమకు రుణమాఫీ రాలేదని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించింది.

మండలాల వారిగా రైతుల నుంచి ఫిర్యాదులను తీసుకుంటుంది. రైతుల నుంచి తీసుకున్న ఫిర్యాదులను పంట రుణం వీవర్స్ పోర్టల్ లో చెక్ చేసి పూర్తి వివరాలు రైతులకు తెలియజేస్తారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారందరికీ రుణమాఫీ అందిస్తామని భరోసా కల్పించింది.

రైతులు ఏం చేయాలంటే :

రుణమాఫీ అందని రైతులు వారి వద్ద ఉన్న సమాచారం.. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ తీసుకొని వ్యవసాయ అధికారి కార్యాలయంలో గాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో గాని అధికారులకు అందజేయాలి. అధికారులు రైతు వద్ద నుంచి తీసుకున్న వివరాల ప్రకారం.. వీవర్స్ పోర్టల్ లో చెక్ చేస్తారు.  ఆ పోర్టల్ లో ఉన్న సమాచారం మేరకు రైతులకు అందజేస్తారు. రైతుకు ఎంత రుణమాఫీ అయింది..? ఎంత కాలేదు..? తెలిసిపోతుంది.

అంతేకాకుండా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలిసిపోతాయి. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు తెలియజేస్తారు. రైతులకు సంబంధించిన సమాచారంలో అప్పులు ఉంటే వాటిని సరిచేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. రుణం తీసుకున్న వారి ఆధార్ కార్డును పోర్టల్ లో నమోదు చేస్తారు. అసలు వడ్డీ మొత్తంలో సరిపోకపోతే రైతు నుంచి దరఖాస్తు తీసుకొని వివరాలను నమోదు చేస్తారు.

రైతుల నుంచి పూర్తిగా తీసుకున్న వివరాలను బ్యాంకులకు పంపుతారు. ప్రభుత్వం నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులు వెళ్లి చెక్ చేయించుకుని పత్రాలను అందజేస్తే రుణమాఫీ అందనున్నది.

LATEST UPDATE : 

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!

ROR : రేపు తెలంగాణ నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ.. సూచనలు, సలహాలు ఇవ్వండి.. అందరికీ ఆహ్వానం..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

మరిన్ని వార్తలు