Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో లిఫ్ట్ ల నిర్మాణాలు.. భూసేకరణ ప్రక్రియ చేయాలి..!

మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో లిఫ్ట్ ల నిర్మాణాలు.. భూసేకరణ ప్రక్రియ చేయాలి..!

నలగొండ, మన సాక్షి :

ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూములకై వెంటనే భూసేకరణ ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణ పై నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫర్ న్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి అవసరమయ్యే భూముల పూర్తి వివరాలుతో ప్రతిపాదనలు పంపించాలని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు ఉన్నట్లయితే వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే పట్టా భూములు ఉంటే సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అలాంటి భూములను సైతం సేకరిస్తామని, లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఎక్కడ భూములు అవసరమో వాటి వివరాలన్నింటిని తక్షణమే పంపించాలని ఆదేశించారు.

మిర్యాలగూడ డివిజన్లో నెల్లికల్ స్టేజ్ 1 కు సంబంధించి 7.4 ఎకరాలకు వారంలోపు పి ఎన్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను సోమవారం నుండి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సంయుక్త తనికి బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల భూ సేకరణకు సోమవారం నుండి అన్ని మండలాలలో సంయుక్త తనిఖీలు ప్రారంభించాలని ఆయన అన్నారు. డిండి కింద దేవరకొండ డివిజన్ పరిధిలో అంబాభవాని, కంబాలపల్లి, పొదిల్ల లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన భూసేకరణ పై ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు సరైన విధంగా ప్రణాళిక తయారు చేయాలని, ఏలాంటి సమస్యలు ఉన్న ఈ నెల చివరినాటికి అన్ని పరిష్కరించాలని, భూమి లేని కారణంగా ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగకూడదని అన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ల పూర్తి లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత వారి పై ఎక్కువగా ఉందని తెలిపారు.

ఆర్డీవోలు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుల భూ సేకరణ పనులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.

అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ పనులు చూసే విభాగం సైతం లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఆయా లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణ సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ తో వివరాలను తెలియజేశారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్డీవోలు, తదితరులు హాజరయ్యారు.

LATEST UPDATE : 

Miryalaguda : శిధిలావస్థలో తడ్కమళ్ల ప్రాథమిక పాఠశాల.. తరగతి గదులు ఖాళీ చేయించిన అధికారులు..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు