Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

 Khammam : ఖమ్మం జిల్లాలో వరి పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిన కారు..! 

Khammam : ఖమ్మం జిల్లాలో వరి పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిన కారు..! 

నేలకొండపల్లి,  మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీ కొట్టి వ్యవసాయ పొలం లోకి దూసుకెళ్లింది. పక్కనే బావి ఉంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది..

అందులో ఉన్న ఆరుగురు కు స్వల్ప గాయాలైయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం చెరువు అలుగు అందాలు, పార్క్ ను తిలకించేందుకు ముదిగొండ మండలం లోని మల్లారం గ్రామానికి చెందిన యువకులు గురువారం వెళ్లారు. అక్కడ సంతోషంగా గడిపారు.

తిరుగు ప్రయాణంలో మండలం లోని అజయ్ తండా సమీపంలో కారు అదుపు . తప్పి వ్యవసాయం పొలం లోకి పల్టీలు కొట్టుకుంటూ దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, మధు, విజయ్, నవీన్, మురళీ లకుస్వల్ప గాయాలైయ్యాయి. కాగా కారు పల్టీ కొట్టిన దగ్గరే వ్యవసాయ బావి ఉంది.

మరి కొద్ది దూరం వెళ్లినట్లయితే పెను ప్రమాదం సంభవించేది.. స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద స్థలం వద్ద తండా వాసులు చోరవ తీసుకుని యువకులను కారులో నుంచి బయటకు తీశారు. గాయాలైన వారిని ఖమ్మం తరలించారు. గ్రామస్తుల సహాకారంతో జెసీబీతో కారు ను బయటకు తీశారు.

LATEST UPDATE : 

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

మరిన్ని వార్తలు