Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!

BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!

మన సాక్షి :

మన్యంలో మరోసారి తుపాకీల తూటాలు మోగాయి.కోన్ని సంవత్సరాలు తర్వాత కాల్పులు చోటు చేసుకోవడంతో మన్యం వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. మావోయిస్టు లకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కరకగూడెం మండలంలోని, రఘునాథ పాలెం అటవీ ప్రాంతంలోని తిరుమల దోనెల గుట్ట ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరకగూడెం మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టు లు సంచరిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు,గ్రే హౌండ్స్ పోలీసులు అడవులను విస్తృతంగా జల్లెడు పడుతున్నారు. ఈ కోణంలోని రఘనాధపాలెం అటవీ ప్రాంతంలో తిరుమల దోనెల అటవీ ప్రాంతంలో ,మావోయిస్టు తారస పడ్డారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టు లకు భీకరంగా ఎదురుకాల్పులు దాదపు పావుగంట సేపు జరిగాయి. కొద్దిసేపటి కి కాల్పులు మావోయిస్టు ల నుండి ఆగిపోవడంతో, పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు లు మృతి చెందడంతో పాటు, ఇద్దరు పోలీసులకు గాయలైనట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు.

గాయాలైన పోలీసులను భద్రాచలం ఏరియా అసుపత్రికి వైద్యం కోసం 108 ద్వారా తరలించారు. ఈ ఎదురు ఎన్ కౌంటర్ లో మణుగూరు ఏరియా కమిటి లచ్చన్న దళంగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత లచ్చన్న మృతి చెందినట్లు సమాచారం. ఘటన ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇంకా ఎంత మంది మావోయిస్టు లు ఈ కాల్పుల్లో పాల్గొన్ని ఉంటారని,వారి కోసం అన్వేషణ చేపట్టారు. ఈ కాల్పుల్లో జరగడంతో పినపాక,కరకగూడెం మండలంలో పోలీసులు అణువు, అణువున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులు పై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

LATEST UPDATE : 

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8లో.. సోనియా ఎవరో తెలుసా..!

MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు