మిర్యాలగూడ : చాకలి ఐలమ్మ వర్ధంతి లో ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు..!
మిర్యాలగూడ : చాకలి ఐలమ్మ వర్ధంతి లో ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగళవారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డాక్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, నూకల వేణుగోపాల్ రెడ్డి, తలకొప్పుల సైదులు, బల్గూరి శ్రీనివాస్, రజక సంఘం నాయకులు రవి, యాదగిరి, నాగభూషణం, పొదిల బ్రహ్మం, రాజు, రాచూరి రాములు, దుర్గయ్య, లక్ష్మీనారాయణ, సైదులు, చంద్రయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!
Narayanpet : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!









