Miryalaguda : ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!
Miryalaguda : ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!
మాడుగుల పల్లి, మన సాక్షి:
ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని లేదంటే చర్యలు తప్పవని మిర్యాలగూడ ఏ డి ఏ దేవ్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం మాడుగుల పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్స్ దుకాణదారులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశం లో సీడ్ ఫర్టిలైజర్ యాక్ట్ పై అవగాహన కల్పించారు. అదేవిధంగా యూరియాను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని సూచించారు లేనిచో పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎరువుల విక్రయాలు ఈ పాస్ ద్వారానే విక్రయించాలని సూచించారు మండలంలో ఎరువులు సరిపడా ఉన్నాయని ఎరువుల కొరత ఏమి లేదని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వస్తుందని రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. రైతులు తమ సమస్యల నివృతి కోసం వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
LATEST UPDATE :
Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!
TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









