ఎండిన వరి పొలాల వద్ద పాలేరు పాత కాలువ ఆయకట్టు రైతులు నిరసన..!
ఎండిన వరి పొలాల వద్ద పాలేరు పాత కాలువ ఆయకట్టు రైతులు నిరసన..!
నేలకొండపల్లి, మన సాక్షి:
సాగు నీటి ని వెంటనే అందించకుంటే వరి పంట ను వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం గ్రామంలో ఎండిన, నెర్రలు చాచిన వరి పొలాల వద్ద పాలేరు పాత కాలువ ఆయకట్టు రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు….వేలాది రూపాయలు వెచ్చించి వరి పంటలు సాగు చేశామని, తీరా బిర్రు పొట్ట దశలో నీరు అందకపోవటంతో రైతులు క న్నీటి పర్యంతమైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులలో నీటిని అందించకుంటే పాలేరు పాత కాలువ 18, 19 తూము పరిధిలో దాదాపు రూ.4 కోట్ల విలువైన పంట నేలపాలవుతుందని రైతులువాపోతున్నారు.
ఒక పక్క వర్షం, వరదల వలన నష్టపోయిన రైతులకు మూలిగే నక్క పై తాటికాయ పడినట్లుగా రైతుల పరిస్థితి ఉందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరహారదీక్ష, పాలేరు రిజర్వాయర్ ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు బొనగిరి కిరణ్, యలమద్ది లెనిన్, వడ్లమూడి గురవయ్య, వడ్లమూడి వీరస్వామి, ప్రసాద్, బొనగిరి కిరణ్, పొలంపల్లి వీరబాబు, దమ్మాలపాటి వీరేష్తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!









