Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నాలుగు చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం వై జంక్షన్, నందిపాడు క్రాస్ రోడ్డు, చింతపల్లి క్రాస్ రోడ్డు, ఈదుల గూడ జంక్షన్ లో ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రేపు (బుధవారం) రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ఫ్లై ఓవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు రైస్ మిల్లర్స్ 30 టన్నుల బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
LATEST UPDATE :
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!
Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!









