Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో పంట కాలువలో మొసలి కలకలం..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో పంట కాలువలో మొసలి కలకలం..!

మునగాల మన సాక్షి :

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామ రెవెన్యూ శివారు పంట పొలాల వద్ద సాగునీటి కాలువలో ముసలి కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బరాకత్ గూడం గ్రామ రెవెన్యూ శివారు పరిధిలోని బరా కత్ గూడెం గ్రామానికి చెందిన కాశీం అనే రైతు తన కుమారుడు అబ్దుల్ కలాం ను తమ పొలం వద్ద మోటారు ఆన్ చేయమని చెప్పారు.

మధ్యాహ్న సమయంలో అబ్దుల్ కలాం పొలం వద మోటర్ ఆన్ చేసేందుకు వెళ్ళగా అటుగా వెళుతున్న కాలువ నీటిలో ముసలి ప్రత్యక్షమవడంతో మొసలిని చూసిన అబ్దుల్ కలాం భయభ్రాంతులకు గురై స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు స్థానిక మునగాల తహసిల్దార్ ఆంజనేయులుకు సమాచారం ఇవ్వడం జరిగింది.

అనంతరం తహసిల్దార్ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకొని అబ్దుల్ కలాంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని కాలువ పరిసర ప్రాంతాలను, మునగాల, చిలుకూరు రెవెన్యూ అధికారులతో మరియు స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రత్యక్షంగా చూసిన అబ్దుల్ కలాం విచారించి జరిగిన ఘటనను తహసిల్దార్ ఆంజనేయులు జిల్లా అటవీ శాఖ అధికారికి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ మొసలి సంచరించిన కాలువ ఉన్న ప్రదేశం మునగాల రెవెన్యూ పరిధిలోనిది కాదని చిలుకూరు మండలం పోలేని గూడెం రెవెన్యూ పరిధిలోనిది కావడంతో చిలుకూరు తాసిల్దార్ కి సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

చిలుకూరు ఆర్ఐ, తాను ఘటన స్థలాన్ని పరిశీలించి జిల్లా అటవీ శాఖ అధికారికి సమాచారం అందించగా వారు స్పందించి రేపటినుండి కాలువ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తామని తెలిపారని, కావున మొసలి కలకలం సంఘటన విషయంలో మండల పరిధిలోని బరాకత్ గూడెం ముకుందాపురం గ్రామ రెవెన్యూ ప్రాంతంలోని రైతులు పొలాల వద్దకు వెళ్లేటప్పుడు, సాగునీటి కాలువలోకి దిగేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ఆంజనేయులు సూచించారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు